రాజమహేంద్రవరం పార్లమెంట్‌, అసెంబ్లీకి పోటీ

0
277
ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా
రాజమహేంద్రవరం, మార్చి 12 : వచ్చే  ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ఆర్పీసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ తెలిపారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ తమపార్టీకి ఉంగరం గుర్తు కేటాయించిందన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు పార్టీ మారబోమని, ప్రజలు వేసిన ఓట్లు వృధా చేయబోమని ప్రమాణం తీసుకోవాలని సూచించారు. కులాలకు, మతాలకు తావులేకుండా ప్రజల కోసం ఎటువంటి ఉద్యమం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజమహేంద్రవరం ప్రజలు జలకాలుష్యంతో కూడిన నీరు తాగి రోగాలపాలవుతున్నారని ఏ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నగర ప్రజలకు ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో రైల్వే విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఉద్యమం చేస్తామన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించి ప్రజలను ఇబ్బందుల నుంచి తప్పిస్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కొత్తపల్లి భాస్కరరామం, లంక దుర్గాప్రసాద్‌, కాసా రాజు, కొల్లి సిమ్మన్న, బర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here