రాజమహేంద్రవరం ప్రెస్‌ ఫోటోగ్రాఫర్లకు అవార్డులు

0
515
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 11 : తమ ఫోటోల ద్వారా సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు మరో వైపు ప్రక తి అందాలను క్లిక్‌ మనిపించే రాజమహేంద్రవరం ప్రెస్‌ ఫోటోగ్రాఫర్లు పలువురు అవార్డులు దక్కించుకున్నారు. స్టేట్‌ ఫోటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటో అవార్డ్స్‌కు ఆంధ్రభూమి ఫోటోగ్రాఫర్‌ ఎస్‌.బి.రాజేశ్వరరావు (బాబి), డెక్కన్‌ క్రానికల్‌ ఫోటోగ్రాఫర్‌ ఆలపాటి మణికంఠ కుమార్‌ ఎంపికయ్యారు. రాజేశ్వరరావుకు ఎఫ్‌.ఐ.పి. హానరబుల్‌ మెన్‌షన్‌ దక్కింది. ఆయన ఈ అవార్డుకు మూడవసారి ఎంపిక కావడం విశేషం. ఈ అవార్డును వచ్చే నెల 1వ తేదిన విజయవాడలో అందుకోనున్నారు. 2017లో జాతీయ స్థాయిలో స్పాట్‌ న్యూస్‌లో తాను ద్వితీయ స్థానం సాధించానని, అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచార శాఖ నిర్వహించిన పోటీల్లోను,స్వచ్చాంధ్ర విభాగంలో అవార్డులు వచ్చినట్లు రాజేశ్వరరావు తెలిపారు. వారికి అవార్డులు రావడం పట్ల పలువురు పాత్రికేయులు అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here