రాజమహేంద్రిలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు

0
318
రాజమహేంద్రవరం, జనవరి 7 : రాజమహేంద్రి మహిళా జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలో ఈరోజు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా, ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా హరిదాసులు, గంగిరెద్దులు, సన్నాయి మేళాలు, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, పాలపొంగళి, గొబ్బిళ్ళుతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్లు వేడుకలను నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ పాశ్చాత్య మోజులో సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఫ్యాషన్‌ సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిన ఈ తరుణంలో ఇటువంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి కళాశాల విద్యార్ధినులకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమన్నారు. విద్యార్ధినులు ప్యాషన్‌ దుస్తులు కాకుండా సంప్రదాయమైన దుస్తులతో, వేషధారణతో రావడం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో 35 వ డివిజన్‌ కార్పొరేటర్‌  కరగాని వేణు మాధవి మాట్లాడుతూ క్రమశిక్షణతో, విద్యా ప్రమాణాలతో కళాశాలను నిర్వహిస్తూ ఇటువంటి సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని  అన్నారు.కళాశాల డైరక్టర్‌ మేజర్‌ చల్లా సత్యవాణి మాట్లాడుతూ  కళాశాల ఇస్తున్న జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ వల్ల ఈ ఏడాది అనేకమంది ఉద్యోగాలు పొందారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ నాళం రజనీ ముగ్గులు, సంక్రాంతి పాటలు,  నృత్యం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎకడమిక్‌ డైరక్టర్‌ టి.ఉమామహేశ్వరి, స్వరూప్‌రెడ్డి, సత్య సౌందర్య పాల్గొన్నారు.