రాజమహేంద్రి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ప్రారంభించిన కిరణ్‌కుమార్‌రెడ్డి

0
185
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : సంపత్‌నగర్‌లో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్‌ టి.కె.విశ్వేశ్వరరెడ్డి నూతనంగా నెలకొల్పిన రాజమహేంద్రి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, పిసిసి అధ్యక్షులు ఎంవి రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, మాజీ ఎమ్మెల్యేలు  రౌతు సూర్యప్రకాశరావు, తేతలి రామారెడ్డి, ఎపిఐఐసి మాజీ ఛైర్మన్‌ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, ఆర్యాపురం బ్యాంకు ఛైర్మన్‌ చల్లా శంకర్రావు, డిసిసి అధ్యక్షులు ఎస్‌ఎన్‌ రాజా, తేతలి కొండబాబు, మేజర్‌ చల్లా సత్యవాణి, ఆర్యాపురం బ్యాంకు వైస్‌ ఛైర్మన్‌ అయ్యల గోపి, కార్పొరేటర్‌ నండూరి రమణ, బివిఎన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా వీరికి రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టికె విశ్వేశ్వర రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందుగా విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here