‘రాజమహేంద్రి’ కళాశాల ప్రిన్సిపాల్‌గా డా.నాళం రజనీ

0
233
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : రాజమహేంద్రి మహిళా జూనియర్‌, డిగ్రీ, పిజి కళాశాల ప్రిన్సిపాల్‌గా నాళం రజనీ నిన్న పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పి.ఎస్‌.ప్రకాశరావుకు వీడ్కోలు సభ జరిగింది.  ఈ సభకు కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ టి.కె.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించి కొత్తగా బాధ్యతలు తీసుకున్న  రజనీని విద్యార్ధినులందరికీ పరిచయం చేశారు. తరువాత ప్రిన్సిపాల్‌గా ఏడున్నర సంవత్సరాలు కాలేజీని కన్నతండ్రిలా కాపాడారని, పిల్లలను క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్దారని, ఏ సమస్యనైనా సున్నితంగా పరిష్కరించి తగు సూచనలను విద్యార్ధినులకు అందించారని కొనియాడారు. కాలేజీ డైరెక్టరు డాక్టర్‌ మేజర్‌ చల్లా సత్యవాణి పిల్లలు మంచిగా చదువుకుని భవిష్యత్తులో మంచి ర్యాంకులు కాలేజీకి ఇవ్వాలని, విద్యార్ధినులకు తగు సూచనలు అందించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీమతి ఎన్‌.రజని, క్రమశిక్షణతో మెలిగి మంచి మంచి ర్యాంకులు సంపాదించాలని కోరారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.సత్యనారాయణ ప్రసంగించారు. ఈ సందర్భంగా పి.ఎస్‌.ప్రకాశరావు మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాలు తనకు వెన్నుదన్నుగా కృతజ్ఞతలు తెలిపారు.