రాఫెల్‌ స్కాంపై విచారణ జరపాలి 

0
263
సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 15 : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ నగర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్ధానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అలాగే ఈ నెల 18న కర్నూలులో జరుగుతున్న ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ సభ (సత్యమేవ జయతే) పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ జిందాబాద్‌, కాంగ్రెస్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శులు దాసి వెంకట్రావు, బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్‌, కాటం రవి, కాంగ్రెస్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షులు గోలి రవి, పార్టీ నాయకులు షహిన్‌షా, లోడ అప్పారావు, నలబాటి శ్యామ్‌, పిల్లా సుబ్బారెడ్డి, పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్‌, ఐఎన్‌టియుసి దుర్గా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here