రామారెడ్డికి ఉప్పాడ కోటరెడ్డి బృందం అభినందన

0
268
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  28 : వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్‌ బిసి రాయ్‌ అవార్డుకు ఎంపికైన  మానస హాస్పటల్‌ అధినేత డాక్టర్‌ కర్రి రామారెడ్డికి  పలువురు అభినందనలు తెలియజేశారు. దేశంలో ఈ అవార్డు దక్కిన  ఐదుగురు వైద్యులలో  డాక్టర్‌ రామారెడ్డి ఒకరు కావడం మన నగరానికే గర్వకారణమన్నారు. నిత్య విద్యార్ధిగా ఎందరికో స్ఫూర్తిదాయకులుగా నిలిచిన డాక్టర్‌ రామారెడ్డి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు. డాక్టర్‌ రామారెడ్డిని అభినందించిన వారిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పోలు కిరణ్‌మోహనరెడ్డి, ఉప్పాడ జోగిరెడ్డి సేవా సమితి కన్వీనర్‌ ఉప్పాడ కోటరెడ్డి (రాజు), సుబ్బారెడ్డి,  ప్రశాంతి హోటల్‌ శ్రీనివాసరెడ్డి, బాలాజీరెడ్డి,  కెవీ సుబ్బారెడ్డి, నన్నయ యూనివర్శిటీ జగన్‌మోహన్‌రెడ్డి,  కె.ప్రసాద్‌రెడ్డి , నరేంద్రరెడ్డి తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.