రాష్ట్రంలో అవినీతి పాలన

0
248
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బిజెపి నిరసన
రాజమహేంద్రవరం నవంబరు 20:రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు అవధులు లేకుండా పోతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులను విడుదల చేస్తుందన్నారు. అయితే కేంద్రం నుంచి వస్తున్న నిధులను తమ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు క్షత్రియ బాలసుహ్మ్రణ్యసింగ్‌, అయ్యల గోపి, నాళం పద్మశ్రీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి, ఎన్‌ఎన్‌ఎస్‌ చంద్రశేఖర్‌, మట్టాడి చిన్ని, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here