రాష్ట్రంలో రెండు కుటుంబాల పాలనకు చరమగీతం

0
393
ప్రత్యామ్నాయ రాజకీయ విధానానికి సీపీఐ కృషి – వచ్చేనెల 10న ఛలో విజయవాడ
రాజమహేంద్రవరం ఆగస్టు 20 : రాష్ట్రంలో రెండు కుటుంబాల పాలనకు చరమగీతం పాడి సరికొత్త విధానాలతో నూతన రాజకీయ శకాన్ని ప్రారంభించేందుకు వామపక్ష పార్టీలు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకుని 2019 ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. సిపిఐ నగర పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్ర సమితి సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ అసమర్ధ విధానాలపై వచ్చేనెల 10న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని లక్షమందితో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందులో భాగంగా ఈనెల 31 నుంచి విశాఖ నుంచి ఒక జాతా, 29 నుంచి అనంతపురం జిల్లా నుంచి మరొక జాతా ప్రారంభమవుతాయని, ఈ జాతాలు 13 జిల్లాలు పర్యటించి ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తాయని పేర్కొన్నారు. 6,7 తేదీల్లో ఈ జాతా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఎఐటియుసి నాయకులు తోకల ప్రసాద్‌, నక్కా కిషోర్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here