రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా ఏడిద బాబి

0
266
రాజహేంద్రవరం, ఆగస్టు 24 : మెగా అభిమానిగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏడిద బాబి సేవలను గుర్తించిన మెగా బ్రదర్‌ నాగబాబు ఆయనను రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు.2019 నుండి 2022 వరకు బాబి ఈ పదవిలో కొనసాగుతారు. బాబి తండ్రి ఏడిద తాతారావు నాయుడు 35 ఏళ్ళుగా చిరంజీవి అభిమానిగా, తూర్పు గోదావరి జిల్లా అభిమానుల సంఘం అధ్యక్షుడిగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన తనయుడు  బాబి 10 ఏళ్ళుగా  మెగా అభిమానిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బాబి సేవలను గుర్తించి రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో జనసేన నాయకులు కందుల దుర్గేష్‌, మేడా గురుదత్‌ ప్రసాద్‌, రాయపురెడ్డి చిన్నా, సునీల్‌, ప్రియసౌజన్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here