రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడమే ధ్యేయం 

0
173
నామినేషన్‌ దాఖలు చేసిన ఎంపి అభ్యర్ధి ఎన్‌ వి శ్రీనివాస్‌
రాజమహేంద్రవరం, మార్చి 22 :  దేశానికి కాబోయే ప్రధాన మంత్రి రాహుల్‌ గాంధీయేనని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్ధి ఎన్‌వి శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేసారు. స్థానిక  కార్పొరేషన్‌ కార్యాలయంలోని  పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఈరోజు ఆయన నామినేషన్‌ దాఖలు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు పార్లమెంట్‌కు పోటీచేసేందుకు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని హామీలు అమలుకావాలంటే దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకుని వెళ్లి మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని రాహుల్‌ గాంధీ నిరూపిస్తారన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here