రిక్షా కార్మికునికి సన్మానం

0
455
రాజమహేంద్రవరం, ఆగష్టు 25 :   స్థానిక అన్నపూర్ణమ్మ పేట అశోక థియేటర్‌  స్టాండ్‌లో సుమారు 60 సంవత్సరాలుగా రిక్షా తొక్కుతూ అనేక మంది రిక్షాకార్మికులకు సహాయపడిన రాళ్లపూడి ఎర్రిబాబు దంపతులను  బి.సి నాయకుడు మజ్జి.అప్పారావు అద్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా  మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రిబాబు రిక్షా కార్మికునిగా జీవితం ప్రారంభించి రిక్షా కార్మికునేగానే 60 సంవత్సరాలు  కుటుంబాన్ని, తోటి కార్మికులని సన్మార్గంలో నడుపుతూ అందరికి ఆదర్శప్రాయుడుగా నిలిచారని కొనియాడారు.కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, జామిశెట్టి. గాంధీ,లంక సత్యనారాయణ మాట్లాడుతూ ఎర్రిబాబుకి సన్మానం చేయడం రిక్షా కార్మికులను గుర్తించినట్లు అయిందన్నారు. అనంతరం ఎర్రిబాబుని పెద్దలందరు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్టాండ్‌ ప్రెసిడెంట్‌ ముచ్చకర్ల నూకరాజు,సోమిరెడ్డి.సన్యాసిరావు,లొడ.రాజు,వై.నాగరాజు,సోమిరెడ్డి.వీర నాయుడు,ముచ్చకర్ల సత్తిబాబు,వై.సునీల్‌, అధిక సంఖ్యలో రక్ష కార్మికులు,కుటుంబ సభ్యులు,స్టాండ్‌ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here