రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి నేరుగా నగదు ఇవ్వండి 

0
495
సీఎంకు అర్బన్‌ బ్యాంక్‌ల అసోషియేషన్‌ వినతి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 25 : రిజర్వ్‌ బ్యాంక్‌  నుంచి నేరుగా తమకు కొత్త కరెన్సీని అందించి ఖాతాదారుల ఇబ్బందులను తొలగించేందుకు సహకరించాలని
ప్రస్తుతం జాతీయ బ్యాంక్‌ల నుంచి తమకు పరిమితి మొత్తంలో నగదు ఇస్తుండటంతో అది ఖాతాదారుల అవసరాలను తీర్చలేకపోతున్నాయని,దీంతో తాము ఖాతాదారులకు చాలా పరిమితంగా నగదు చెల్లించవలసి వస్తోందని,  ఈ దృష్ట్యా తమకు నేరుగా రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి కొత్త కరెన్సీని తగినంతగా అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఫెడరేషన్‌ చైర్మన్‌ చిట్టూరి రవీంద్ర, కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం, ఉపాధ్యక్షులు జిలానీ, డైరక్టర్లు అంబికాప్రసాద్‌, చలసాని రాఘవేంద్రరావు, వీరయ్య చౌదరిలతో పాటు ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ఇన్నీస్‌పేట బ్యాంక్‌ చైర్మన్‌ కోళ్ళ అచ్యుతరామారావు (బాబు) సీఎంను విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ ప్రతినిధులను చల్లా శంకరరావు సీఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ ప్రతినిధులు పలు అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారు. సహకార బ్యాంక్‌ల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలు ఖాతాదారులుగా ఉంటారని, జాతీయ బ్యాంక్‌లకు ఇచ్చినట్లుగానే తమకు అవకాశం కల్పించాలని కోరారు. నూతన రాజధాని అమరావతిలో ఫెడరేషన్‌ భవన్‌కు ఎకరం స్థలం కేటాయించాలని, సహకార బ్యాంక్‌ల్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, రిజర్వ్‌ బ్యాంక్‌  నియమ నిబంధనలను బోధించేందుకు తమకు భవనం అవసరమని, అధికార యంత్రాంగం ఉండే స్థలంలో సహకార బ్యాంక్‌ల నిమిత్తం స్ధలం కేటాయించాలని వారు కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ శంకరరావు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ డైరక్టర్లు సూరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్‌, అబ్ధుల్‌ ఫహీమ్‌, జాంపేట బ్యాంక్‌  డైరక్టర్లు జామిశెట్టి గాంధీ, మహంతి లక్ష్మణరావు, ఇన్నీస్‌పేట బ్యాంక్‌ డైరక్టర్లు రెడ్డి సత్యనారాయణ, బొంతు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.