రుణాలు ఎగ్గొట్టే వారికి కొమ్ము కాసే మీరా కాపలాదారు?

0
133
చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : ఎన్నికల ప్రచారంలో గన్ని
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 3 : వృద్ధులకు పెద్ద కొడుకుగా, ఆడపడుచులకు పెద్దన్నయ్యగా నిలిచిన చంద్రబాబుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ కోరారు. స్థానిక 42 వ డివిజన్‌ శ్రీరామనగర్‌లో తెలుగుదేశం పార్టీ  సిటి నియోజకవర్గ అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీ ప్రచారం నిర్వహించారు. ముందుగా గుడా చైర్మన్‌ గన్ని నివాసం వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ వయసు మళ్ళిన వారిని ఆదుకునేలా ఫించన్లను రూ.200  నుంచి రూ. 2000 పెంచారని, మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3000 చేస్తారని అన్నారు. ఆడపడుచుల కళ్ళల్లో ఆనందాలు నింపడానికి రూ.పదివేల చొప్పున అందించారని, మళ్ళీ అధికారంలోకి వస్తే రూ.20 వేల చొప్పున ఏడాదికి మూడుసార్లు ఇచ్చేందుకు సిఎం సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో మొక్కవోని దీక్షతో ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చిన ప్రధాని మోడి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తాను చౌకీదార్‌ అని చెప్పుకునే మోడి దొంగలకి, లంచగొండులకు, అవినీతి పరులకు, బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ములను ఎగ్గొట్టేవారికి కాపలా కాసే నాయకుడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నమ్మకం ద్రోహం చేసిన మోడికి, ఆయనకు మద్దతు పలుకుతున్న జగన్‌, కెసిఆర్‌లకు బుద్ది చెప్పాలని కోరారు.ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనపై మహిళల్లో మంచి స్పందన వస్తుందని, తప్పని సరిగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, మాగంటి రామ్మోహనరావు, కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి,  మళ్ళ వెంకట్రాజు, కో ఆప్షన్‌ సభ్యులు ఏ. సంజీవరావు,చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, తాజుద్దీన్‌, ఎంఎ రషీద్‌, సెనివాడ అర్జున్‌, వానపల్లి బ్రదర్స్‌, కొండబాబు, భైరవ, కెవి శ్రీనివాస్‌, అంజి, సంతోష్‌, నాని, బాల తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here