రుణాల కోసం తిరగక్కర్లేదు.. సమావేశాలకు రావక్కర్లేదు

0
204
ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా మహిళలకు రౌతు హామీ
రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 3 :  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం సిటీ అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావు చెప్పారు. నగరంలోని 2, 46 డివిజన్లలో ఆయన  ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డ్వాక్రా రుణాల మంజూరుకు రాజకీయ పార్టీ సమావేశాలు, ఇంకా ఇతరత్రా సమావేశాలు అంటూ వేధించే పరిస్థితిని పూర్తిగా తొలగిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాదిరిగా రుణాలు ఇచ్చిన విషయం కూడా చుట్టూపక్కల వారికి తెలియకుండా మహిళల ఖాతాల్లో రుణాల సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. అక్క చెల్లెమ్మలకు మీటింగ్‌ల పేరుతో వేధిస్తూ, రాకపోతే రుణాలు రావంటూ బెదిరించే ఈ పాలకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. డ్వాక్రా సంఘాల అక్కచెలెమ్మల రుణాలు ఎన్నికల నాటికి ఉన్న మొత్తాన్ని మాఫీ చేస్తామని ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌ హామీ ఇచ్చిన విషయం గుర్తు చేసారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడిగా వైఎస్‌ జగన్‌ కూడా ఇచ్చిన మాట తప్పరని పేర్కొన్నారు. నవరత్నాలతో ప్రతీ కుటుంబానికి విద్య, వైద్య భరోసా లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో 2వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ సంకిస భవానీప్రియ రవి, పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్‌, కుక్కా తాతబ్బాయి, మార్తి లక్ష్మి, మహేష్‌, ఇంటి దొరబాబు, జంగా మణ్యం, వాటర్‌ వర్క్స్‌ రెడ్డి, షేక్‌ తాతాసాహెబ్‌, సుంకర రమణ, ఒళ్ల జగదీష్‌, చంద్రమౌళి, 46వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మేడపోయిన సునీల్‌కుమార్‌, స్థానిక నేతలు పీతల బుజ్జి, అడపా రమణ, కర్రి మురళీ, బి.జిలానీ, మట్టి ధనరాజ్‌  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here