రూ.95 కోట్లతో రోడ్లకు మరమ్మత్తులు

0
173
శంకుస్థాపనకు హాజరుకావాలని గడ్కరీకి భరత్‌ ఆహ్వనం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5 : రహదారులు, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి నుండి జీలుగుమిల్లి  వరకు నేషనల్‌ హైవే 516 రోడ్‌ మరమ్మత్తులు నిమిత్తం రూ.95. 51 కోట్లకు టెండర్లు పిలవడం జరిగిందని,  ఈ పనుల శంకుస్థాపనకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. సుమారు 9. 3 కిలోమీటర్లు రహదారి కూడా పెద్ద గోతులతో ప్రమాదకరంగా ఉందని, దానికి కూడా సుమారు 53.5కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ రహదారిలో తెలంగాణ నుండి కాకినాడ పోర్ట్‌, విశాఖపట్నం పోర్ట్‌ వరకు  గ్రానైట్‌ లోడ్లు వెళ్లడం ప్రజలకు ప్రమాదకరంగాను, ఇబ్బందిగాను ఉందని తరచూ వాహన ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని, దీనిని పరిగణలోకి తీసుకుని ఈ పనికి కూడా అనుమతిని ఇవ్వాలని కోరారు. అలాగే దివాన్‌ చెరువు నుండి బొమ్మూరు వరకు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించే అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు ఎంపీ వెల్లడించారు. 2015 నుండి 2019 వరకు జరిగిన ప్రమాదాల వివరాలు కేంద్రమంత్రికి అందించడం జరిగిందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను దృష్టిలోకి తీసుకుని ఫ్లైఓవర్‌లు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రాజానగరం నుండి మడికి వరకు ఉన్న బ్లాక్‌ స్పాట్స్‌ వివరాలు, ప్రజల నిరసన తరచూ పత్రికల్లో ప్రచురించడం, ఈ సమస్య తీవ్రతను, ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత పైన కూడా పార్లమెంట్‌ సభ్యులు కేంద్రమంత్రికి వివరించడం జరిగిందని ఎంపీ మార్గాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here