రెండేళ్ళలో పోలవరం ప్రాజక్ట్‌ పూర్తి 

0
126
సీఎం జగన్‌ ప్రకటన
రాజమహేంద్రవరం, జూన్‌ 21 : ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును 2021 జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిన్న ప్రాజక్ట్‌ను సందర్శించిన సందర్భంలో అధికారులు 2020 నవంబర్‌ నాటికి పోలవరాన్ని పూర్తి చేయగలమని సీఎం జగన్‌కు చెప్పగా ఆయన అదనపు సమయం తీసుకుని 2021 జూన్‌ లోగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం కావడం, స్పిల్‌వే మీదుగా కూడా వరద ప్రవాహం అనుమతించాల్సిన నేపథ్యంలో నాలుగు నెలలకు పైగా పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈలోగా పోలవరం పనులపై నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వారికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే భూములు సేకరించి అప్పటి ధరలకు అనుగుణంగా పునరావాస సాయం అందించారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా అందరికీ లబ్ధి కలిగేలా పునరావాస ప్యాకేజీ త్వరలో ప్రకటించనున్నారు. వైఎస్‌ హయాంలో సేకరించిన భూములకు ఎకరానికి అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఇందులోని సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. పునరావాస ప్యాకేజీగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందేలా చూడనున్నారు. ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీలకు రూ.6.86 లక్షలు, మిగిలిన వారికి రూ.6.36 లక్షలు పునరావాస ప్యాకేజీగా అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here