రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 

0
165
13న స్పీకర్‌ ఎన్నిక – 14న గవర్నర్‌ ప్రసంగం
అమరావతి, జూన్‌ 11 :  ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారని  ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారని చెప్పారు. తొలి క్యాబినెట్‌ సమావేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్‌, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు.  ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్‌ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here