రేపటి నుంచి ఎస్వీ మార్కెట్‌లో వెంకటేశ్వరాలయ సప్తమ వార్షిక బ్రహ్మొత్సవాలు

0
350
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 1 : ఆర్టీసి కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వరా జనరల్‌ మార్కెట్‌లో వేంచేసి ఉన్న శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మొత్సవాలు రేపటి నుంచి ఈ నెల 10 వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్య్ష, కార్యదర్శులు నందెపు శ్రీనివాస్‌, గ్రంధి రామకృష్ణ, కోశాధికారి బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు తెలిపారు.   ఈ పది రోజుల పాటు స్వామి  వారిని శేష వాహనం, హంస వాహనంపై ఊరేగించడంతో పాటు   హనుమద్వాహనోత్సవం, కల్పవృక్ష వాహనోత్సవం, సింహ వాహనోత్సవం, గరుడ వాహనోత్సవం, గజ వాహనోత్సవం, అశ్వ వాహనోత్సవం, సర్వ భూపాల వాహనోత్సవం నిర్వహిస్తారని వారు తెలిపారు. భక్తులు పాల్గొని తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమాలన్నీ  ఖండవిల్లి సూర్యనారాయణాచార్యులు(రమణబాబు) అర్చకత్వంలో జరుగుతాయి.  అలాగే ఈ ఆలయం పక్కనే ఉన్న శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో  రేపటి నుంచి 11 వ తేదీ వరకు బాబా వారి 98వ పుణ్య తిధి నవరాత్ర మ¬త్సవం జరుగుతుందని తెలిపారు.