రేపటి నుంచి మూల్‌ నివాసీ మేళా 

0
281
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 10 :దేశవ్యాప్త మూల్‌ నివాసీ మేళా -2019ని ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు మూల్‌ నివాసీ జాతీయ ఉపాధ్యక్షుడు నయనాల కృష్ణారావు వెల్లడించారు. జాతిపిత జ్యోతిభా ఫూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంత్యోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక మోరంపూడి ఎపిఎస్‌ఇబి కల్యాణ మండపంలో ఈరోజు జరిగిన సమావేశంలో నయనాల మాట్లాడుతూ 11వ తేదీ గురువారం నగరంలోని 50 ప్రాంతాల్లో ఫూలే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 12న శుక్రవారం లాలాచెరువు వాంబే గృహాల వద్దనున్న ఫూలేే అంబేద్కర్‌ విగ్రహాల వద్ద మేళా జరుగుతుందన్నారు. 13వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు గోదావరి గట్టున ఉన్న రాష్ట్రపిత జ్యోతాభాఫూలే విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ జరుగుతుందన్నారు. 14న ఆదివారం నగరంలోని 95 ప్రాంతాల్లో ఉన్న ఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు మోటారుసైకిళ్లతో భారీగా ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. ఆ తరువాత మూల్‌నివాసీలకు వంటలపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ‘భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలోని రాజ్యాంగ సంస్థలపై బ్రాహ్మణీయ శక్తుల నియంత్రణ-ఎలా? ఎందుకు?  అనే అంశంపై స్థానిక వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాల్‌లో అవగాహనా సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మూల్‌ నివాసీలందరూ భారీఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యోతిభాఫూలే-రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జాతికి అందించిన సేవలను స్మరించుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. బామ్‌సెఫ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎ.ఆదినారాయణ, కార్యదర్శి వి.భాస్కర్‌రాజు, జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌, బామ్‌సెఫ్‌ జిల్లా సభ్యుడు సిహెచ్‌ శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here