రేపటి నుంచి 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

0
229
రాజమహేంద్రవరం, నవంబర్‌ 13 : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని రేపు బాలల దినోత్సవంతోపాటు 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు పలు గ్రంథాలయాలలో ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.  జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన టి.నగర్‌లోని చల్లపల్లి వారి వీధిలో ఉన్న ఇన్నీసుపేట శాఖా గ్రంథాలయంలో రేపటి నుంచి 21వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని గ్రంథాలయాధికారిణి పి.శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్ధులకు పలు పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత 15న ఉదయం చిత్రలేఖనం పోటీలు, 16న ఉదయం వ్యాస రచన పోటీలు, 17న ఉదయం వక్తృత్వ పోటీలు, 18న పాటల పోటీలు నిర్వహిస్తారు. 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ఇందిరాగాంధీ జయంతి జరుపుతామని తెలిపారు. అలాగే ఆల్కాట్‌తోట శాఖా గ్రంథాలయంలో కూడా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయాధికారిణి అబ్బిరెడ్డి చంద్రపద్మాదేవి తెలిపారు. రేపు ఉదయం ప్రారంభ సభతో పాటు నెహ్రూ జయంతిని కూడా నిర్వహిస్తామని, 15న ఉదయం విద్యార్ధులకు సీనియర్స్‌, జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ విభాగాల్లో వ్యాస రచన పోటీలు, 16న ఉదయం సీనియర్స్‌, జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ విభాగంలో పాటల పోటీలు నిర్వహిస్తామని, 17న ఉదయం చిత్రలేఖన పోటీలు జరుగుతాయి. 18న ఉదయం గ్రంథాలయోద్యమ నాయకుల సంస్మరణ సభ జరుగుతుంది. 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 20న వివిధ పాఠశాలల విద్యార్ధులతో అక్షరాస్యతా దినోత్సవ ర్యాలీ నిర్వహిస్తారు. 21న వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతీ ప్రదానోత్సవం జరుగుతుంది.