రేపు కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు

0
126
రాజమహేంద్రవరం, మే 18 : దొమ్మేటి కిడ్నికేర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రేపు ¬టల్‌ ఆనంద్‌ రీజెన్సీలో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు దొమ్మేటి కిడ్నికేర్‌ సెంటర్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌ దొమ్మేటి వీరవెంకటరావు వెల్లడించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ముఖేష్‌ శెట్టితో కలిసి వీరవెంకటరావు మాట్లాడారు. కిడ్నీ సమస్యలతో అనేక మంది ప్రజలు బాధపడుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని కిడ్నీ సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు, ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఈ అవగాహన సదస్సులో ప్రముఖ కిడ్నీకి సంబంధించి ప్రత్యేకమైన వైద్యులచే వివరణ ఇస్తామన్నారు. రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ అవగాహన సదస్సు కొనసాగుతుందన్నారు. సామాన్యులకు ఆధునిక వైద్యాన్ని అందించాలన్నా సంకల్పంతో తమ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here