రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

0
256

వెంట పంచాయితీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8.45 గంటలకు విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 9.35 గంటలకు మండపేట నియోజకవర్గంలోని ద్వారపూడి చేరుకుంటారు. ద్వారపూడిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొని ఆ తర్వాత ఉదయం10.30 గంటలకు అక్కడ జరిగే జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంలో పాల్గొని హెలికాఫ్టర్‌లో విజయవాడ బయలుదేరి వెళతారు. సీఎంతో పాటు పంచాయితీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా సీఎం వెంట పర్యటిస్తారు. అయితే సీఎం చంద్రబాబు విజయవాడ వెళ్ళాక మంత్రి లోకేష్‌ మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బి గెస్టుహౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు స్ధానిక ఆనం కళా కేంద్రంలో జరిగే పంచాయితీరాజ్‌ దినోత్సవంలో పాల్గొని తన శాఖకు చెందిన 250 మంది అధికారులకు అవార్డుల ప్రదానం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు మంత్రి బయలుదేరి వెళతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here