రేపు ప్రసాదుల గురుమూర్తి వర్థంతి

0
190
ఆనం కళాకేంద్రంలో ‘మా ఇంట్లో మహాశివుడు’ నాటిక ప్రదర్శన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 12 : ప్రజా కళాకారులు, నాటకరంగ ప్రముఖులు ప్రసాదుల గురుమూర్తి ద్వితీయ వర్థంతి సందర్భంగా రేపు నగరంలో కళా ఉత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఉదయం 10.30 గంటల నుండి స్మారక నాటక, కళా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం సినీ పాటల పోటీలు జరుగుతాయి. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడకు చెందిన మహేశ్వరి ప్రసాద్‌ కామెడీ క్లబ్‌ వారిచే ‘మా ఇంట్లో  శివుడు’ నాటికను ప్రదర్శిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ‘ఎర్రని దండాలు’ నృత్య రూపక ప్రదర్శన జరుగుతుంది. రాత్రి 8 గంటలకు ఒంగోలుకు చెందిన ఎవనిక వారిచే ‘నరనారాయణీయం’ నాటిక ప్రదర్శిస్తారు. సిసిసి ఎం.డి. పంతం కొండలరావు సభాధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్య మండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ప్రధాన వక్తగా, ప్రజాప్రతినిధులు ముఖ్యఅతిధులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here