రేపు విశాఖకు జగన్‌

0
111
అమరావతి, జూన్‌ 3 : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి రేపు విశాఖపట్నం వెళ్ళనున్నారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామిని కలిసి సీఎం ఆయన ఆశీస్సులు తీసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్‌.. ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్‌, స్వరూపానందను కలవలేదు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. అనంతరం సీఎం తిరిగి అమరావతి చేరుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here