రేపు వైఎస్సార్‌ 69 వ జయంతి

0
229
రాజమహేంద్రవరం, జులై 7 :  దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 69 వ జయంతి సందర్భంగా రేపు ఉదయం 9 .30 కు జాంపేటలోని పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు తెలిపారు. ఈ సందర్భంగా   వ ద్దులకు చీరలు పంపిణీ చేస్తారు. అనంతరం కోటగుమ్మం,క్వారీ సెంటర్‌,లాలాచెరువు,బైపాస్‌రోడ్‌, రెల్లి పేట సెంటర్‌,మోరంపూడి సెంటర్‌ల వద్ద జయంతి కార్యక్రమాలు  జరుగుతాయని తెలిపారు.  ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కవురు శ్రీనివాస్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్‌ లు కూడా పాల్గొంటారని రౌతు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here