రైల్వే ప్రైవేటీకరణను అడ్డుకుందాం

0
77
్‌ద్వైవార్షిక సమావేశంలో మాజీఎంపీ మిడియం బాబూరావు పిలుపు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 13 : బిజెపి ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ద్వైవార్షిక సమావేశం హకుంపేట రోడ్డులోని అవ్య సెమినార్‌ హాల్లో  ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. అందులో భాగంగా 33 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక చట్టాలుగా కుదించడం, వంద రోజుల రైల్వే ప్రైవేటీకరణ ప్లాన్‌, 55 సంవత్సరాలు వయస్సు లేదా 30 సంవత్సరాలు సర్వీసు ఉన్న ఎంప్లాయీస్‌ను ఉద్యోగాల్లోంచి తొలగించాలనే పన్నాగం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరోక ప్రక్క మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఆర్ధిక మాంద్యం దిశగా కొనసాగుతుందన్నారు. దీనివల్ల కార్మికుల కొనుగోలు శక్తి, కుటుంబ ఆర్థిక వ్యవస్థ అయోమయంలో పడే అవకాశాలు ఉన్నాయన్నారు. కావున కార్మికులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా వ్యతిరేకించి ప్రభుత్వరంగంలోనే రైల్వే నిర్వాహణ జరిగిలా ఉద్యమించాలన్నారు. యూనియన్‌ సెట్రల్‌ కమిటీ ఉపాధ్యాక్షులు టి.హనుమయ్య మాట్లాడుతూ తక్షణమే రైల్వేను ప్రైవేటీకరణ చేసే యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే లోకో పైలెట్ల అసిస్టెంట్‌ డ్రైవర్‌ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రన్నింగ్‌ అలవెన్స్‌ను రివైజ్‌ చేసి 2016 జనవరి ఒకటి నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే డ్రైవర్ల వారాంతపు సెలవును 30 గంటలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ నాయకులు ఎస్‌.గురుమూర్తి, ఎస్‌కె చౌయ్‌, కె.లక్ష్మణరావు, పాత్రుడు, సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ మూర్తి, ఐఎఫ్‌టియు నాయకులు ఎవి రమణ, తదితరులు మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here