రైల్వే స్టేషన్‌ లో స్వచ్ఛతపై అవగాహన

0
213
  రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 15:  ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఉదయం స్వచ్ఛ పక్వరా – స్వచ్ఛ్‌  అవేర్నెస్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ రామారావు, డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రాజేంద్ర ప్రసాద్‌ విచ్చేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు  ఈనెల 15నుంచి అక్టోబర్‌ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. రైల్వే స్కూల్‌, ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు, రైల్వే అధికారులు  వెస్ట్‌ కాలనీ చిల్డ్రన్స్‌ పార్కు నుంచి క్లిన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా వంటి నినాదాల ప్లే కార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ ఫ్లాట్‌ ఫార్మ్‌ వన్‌ మీదుగా రైల్వే స్టేషన్‌ వరకు చేరుకొని ప్రతిజ్ఞ నిర్వహించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్బంగా ప్రధాని మోడీ,  ఇచ్చిన  ప్రసంగాన్ని పెద్ద స్క్రీన్‌ పై ప్రదర్శించారు. రైల్వే అధికారులు స్టేషన్‌ శుభ్రపరిచారు.  అనంతరం రైల్వే స్టేషన్‌ ఆవరణలో పరిసరాల శుభ్రత ఎలా పాటించాలి, ఒకవేళ అతిక్రమిస్తే జరిమానా ఎలా విధిస్తారో వంటి విషయాలపై స్కిట్‌ నిర్వహించారు. విద్యార్థులకు గో గ్రీన్‌ నినాదంతో మొక్కల పంపిణీ చేసారు. విద్యార్థులకు ఈ సందర్బంగా కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ జ్యుట్‌ బ్యాగులు అందజేశారు. ఆర్పీ ఎఫ్‌ కమీషనర్‌ నగేష్‌ నటియార్‌,  మెమో కార్‌ షెడ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ ప్రసాదరావు,డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రామారావు,ఏఎస్‌టిఈ వెంకట రమణ, ఎడి ఈ ఎన్‌ హరిక ష్ణారెడ్డి,స్టేషన్‌ మేనేజర్‌ ప్రభాకర్‌, చీఫ్‌ టికెట్‌ ఇనస్పెక్టర్‌ కేశవభట్ల శ్రీనివాసరావు,ఆర్పీ ఎఫ్‌ ఇనస్పెక్టర్‌ రామయ్య, కమర్షియల్‌ ఇనస్పెక్టర్‌ కళ్యాణ్‌, సి టి ఐ ఎలీషా, జి ఆర్పీ ఎస్‌ఐ మావుళ్లు,తదితర రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here