లక్ష్మివారపుపేటలో వయోవృద్ధుల దినోత్సవం

0
336
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : డాక్టర్‌ ఎం.వి.రాఘవులు మెమోరియల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం స్థానిక లక్ష్మివారపుపేటలోని ట్రస్ట్‌ ఆవరణలో జరిగింది. తొలుత డా.ఎం.వి.రాఘవులుకు నివాళులర్పించారు. డా.ఎం.వి.రాఘవులు  మీకోసం మేము సంస్థని స్థాపించి సుమారు 42వేలమంది వయో వృద్ధులకు వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన కుమారుడు ఎం.వి.వి.శ్రీనివాస్‌, డా.ఎం.వి.రాఘవులు మెమోరియల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఈ సేవలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 49వేల మంది వయో వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు  పంపిణీ చేశారు. ప్రపంచ వయో వృద్ధుల  దినోత్సవాన్ని పురస్కరించుకుని పండ్లు, ఉచిత మందులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో డా.ఎన్‌.సత్యనారాయణ వైద్య పరీక్షలు అందించారు. ఎం.కిరణ్‌ సూర్యదేవి సహకారం అందించారు.  ఈ కార్యక్రమంలో  దార్వాడ రామకృష్ణ , ఫణి నాగేశ్వరరావు, కరుటూరి శ్రీనివాస్‌, బి.రవికుమార్‌, ఎన్‌.శ్రీనివాస్‌, మెడికల్‌ షాపు రాంబాబు, బేజు తదితరులు పాల్గొన్నారు.