లగడపాటి సర్వే లోపభూయిష్టం

0
204
అంతిమంగా వైకాపాదే విజయం : శ్రిఘాకొళ్ళపు
రాజమహేంద్రవరం, మే 21 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వే చాలా లోపభూయిష్టంగా ఉందని ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెెస్‌ పార్టీ నాయకులు శ్రిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, జనసేన ప్రభావం ఎంతగా ఉందనేది ఆయన స్పష్టం చేయలేకపోయారని ఆయన ఈరోజు  పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ప్రజల్ని గందరగోళపరిచేలా లగడపాటి సర్వే ఉందని విమర్శించారు. సర్వేలపై కొంత నమ్మకం, కొంత అప నమ్మకం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. తెదేపాకు 40 నుంచి 50 సీట్లు దాటి వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు పాలనా వైఫల్యాలు ఆ పార్టీని నిలువునా ముంచుతున్నాయని, తెదేపా నాయకులే ఆ మాటలు చెబుతున్నారన్నారు. జగన్‌ పాదయాత్ర, నవరత్నాలతో వైకాపా అధికారం చేపట్టడం ఖాయమన్నారు.   అన్ని నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం తాము ఓటర్లతో మాట్లాడినప్పుడు స్పష్టమైందని, అందువల్లనే వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాగా ఈవిఎంలలో లోపాలంటూ చంద్రబాబు హడావిడి చేయడం, సాకులు చెప్పడం చిన్నపిల్లల ఆటలో సాకులు చెప్పడంలా ఉందన్నారు.
సిటీలో వైకాపా గెలుపు ఖాయం
రాజమహేంద్రవరం సిటీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని శివరామ సుబ్రహ్మణ్యం చెప్పారు. టిడిపి 40వేల మెజార్టీతో గెలుస్తుందంటూ తెదేపా వాళ్ళు లెక్కలు వేయడంలో అర్ధం లేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎడ్జ్‌ ఉందన్నారు. ఎన్నికల మేనేజ్‌ మెంట్‌ లో వైస్సార్‌ సిపి రాజమండ్రిలో కొంత విఫలమైనప్పటికీ, గెలుపుపై పెద్దగా ప్రభావం చూపదని  ఆయన విశ్లేషించారు. ఇక అదేసమయంలో  తెలుగుదేశం పూర్తిగా విఫలమైందని  ఆయన పేర్కొన్నారు. నామినేషన్‌ సమయం వరకూ వైస్సార్‌ సిపిలో గొడవలు ఉన్నప్పటికీ, ఆతర్వాత అంతా సర్దుమణిగిందని,గెలుపే ధ్యేయంగా అందరూ పనిచేశారని ఆయన పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటీలో ఉన్నప్పుడు ఏ పార్టీ అభ్యర్ధి గెలిచినా 15 వేల ఓట్ల మెజారిటీ దాటి రాదని, అయితే తెదేపా వారు 40 వేల మెజార్టీతో గెలుస్తామనడం హాస్యాస్పదమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here