లాలాచెరువు నుంచి బొమ్మూరుకి ఏక ఫ్లైఓవర్‌

0
576
కేంద్రమంత్రికి ఎంపీ మార్గాని భరత్‌ లేఖ
రాజమహేంద్రవరం,ఆగస్టు 12 : జాతీయ రహదారిపై లాలాచెరువు నుండి బొమ్మూరు వరకు ఒకే ఫ్లైఓవర్‌ నిర్మాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని  రాజమహేంద్రవరం ఎంపీ, వైకాపా పార్లమెంటరీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన  కేంద్ర ఉపరితల రవాణా శాఖ  మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసారు. దివాన్‌ చెరువు నుండి జొన్నాడ వరకు 5 ఫ్లై ఓవర్‌ లు నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదనలు పంపిందని, భూసేకరణ పూర్తయ్యిందని, ఒక్క మోరంపూడి భూ సేకరణ పూర్తి కావలసి ఉంది. ఈ జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగి వందల మంది  ప్రాణాలు కోల్పోయారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా 5 ఫ్లై ఓవర్లు కాకుండా లాలాచెరువు నుండి బొమ్మూరు వరకు ఒకే ఒక ఫ్లై ఓవర్‌ నిర్మించే విధంగా నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు ఇచ్చి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తీసుకోవాలని కోరారు. దీని వలన ఎ.వి.అప్పారావు రోడ్‌, జె.ఎన్‌. రోడ్‌, కవలగొయ్యి రోడ్‌, మోరంపూడి జంక్షన్‌, బొమ్మూరు వాహనచోదకులకు అనుకూలంగా ఉంటుందని, అలాగే ప్రమాదాలను అరికట్టవచ్చని కోరగా దీనికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే నివేదిక ను పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పార్లమెంట్‌ సభ్యులు తెలిపారు. అలాగే కత్తిపూడి నుండి రావులపాలెం, రాజమహేంద్రవరం నాలుగో బ్రిడ్జి నుండి గుండుగోలను వరకు జాతీయ రహదారి పాక్షికంగా పాడై గుంతలు ఏర్పడి వాహన చోదకులకు, భారీ వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురై ప్రమాదాలకు దారి తీస్తుందని దీన్ని వెంటనే యుద్ధప్రాదిపతికన పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని  ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాకు పార్లమెంట్‌ సభ్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here