లీకులు – సాకులు

0
241
మనస్సాక్షి  – 1114
అలా తెల్లవారిందో లేదో వెంకటేశం యిలా వచ్చే శాడు. అయితే మనిషిలో ఎప్పటిలాంటి హుషారులేదు. బొత్తిగా పదిలంఖణాలు చేసి నట్టున్నారు. ఆపాటికి యింటి తలుపులు వేసి మెట్లు దిగుతున్న గిరీశం ”రావోయ్‌ వెంకటేశం… అలా ఉన్నావేం? కొంపతీసి పెళ్ళీ గిళ్ళీ  సెటిల యిందా?” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఊరు కోండి గురూగారూ.. కొంచెం అహం దెబ్బతింది లెండి” అన్నాడు. ఆపాటికి చుట్ట తీసి నోట్లో పెట్టుకున్న గిరీశం ”రేపెలాగా రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నవాడివి. యిలాంటి అహాలూ, ఆత్మాభి మానాలూ ఉండకూడదు. అయినా ఏం జరి గింది?” అన్నాడు. వెంకటేశం పక్కన నడుస్తూనే ”నాకో కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌లో నూటికి యిరవై మూడే వచ్చాయి గురూగారూ” అన్నాడు. దాంతో గిరీశం అర్థంకానట్టుగా ”నువ్వు ప్రిపేరవుతుంది ఆ సివిల్సో, గ్రూప్‌వన్నో కదా.. అవేవీ యిప్పుడేం లేవే..” అన్నాడు. ఈసారి వెంకటేశం కొంచెం యిబ్బందిపడి” లేదు గురూగారూ.. నాకా మార్కులొచ్చింది గ్రూప్‌-ఫోర్‌ పరీక్షలో. ఉద్యోగం కోసం అని కాదుగానీ నేనే సరదాగా గ్రూప్‌-ఫోర్‌ రాశా.  నేనెలాగా సివిల్స్‌కి గట్టిగానే ప్రిపేరవుతున్నాకదా! అందుకే యిందులో మంచి రేంకే వస్తుందని రాశా. తీరా చూస్తే దారుణంగా నూటికి 23 వచ్చాయి” అన్నాడు. అది వినేసరికి గిరీశం కూడా షాకయినట్టుగా అయి పోయాడు. అంతలోనే ”ఎందుకో నువ్వు  చెప్పేది వింటుంటే చార్లీ చాప్లిన్‌ విషయంలో జరిగింది గుర్తొస్తుందోయ్‌..” అన్నాడు. వెంకటేశం అదేం టన్నట్టు ఆసక్తిగా చూశాడు. అప్పుడు గిరీశం చెప్పడం మొదలెట్టాడు. ”అప్పట్లో చార్లీచాప్లిన్‌ సినిమాల్లో జోరుగా నటిస్తున్నాడు. మంచి పేరొచ్చే సింది. అలాంటి టైంలో ఓరోజు చార్లీచాప్లిన్‌ ఏదో పనుండి ఓ పల్లెటూరి వైపు వెళ్ళడం జరిగింది. ఆపాటికి అక్కడేదో పోటీ జరుగుతోంది. యింతకీ ఆ పోటీ చార్లీచాప్లిన్‌లా నటించడమే. చాలామంది చార్లీచాప్లిన్‌లా గెటప్‌ వేసుకుని అందులో పాల్గొంటున్నారు. దాంతో చార్లీచాప్లిన్‌ తనెవరో చెప్పకుండానే ఆ పోటీలో పాల్గొన్నాడు. ఆశ్చర్యం..! చార్లీచాప్లిన్‌కి ప్రైజ్‌ రాలేదు..! వేరెవరికో వచ్చింది. యిదెందుకు చెప్పానంటే నీకున్న టేలెంట్‌కేం లోటులేదు. ఆ సివిల్స్‌గానీ, గ్రూప్‌ వన్‌ గానీ కొట్టే తీరతావు. యిక్కడేదో పొరబాటు జరిగుంటుంది. అంతే” అన్నాడు. అయినా వెంకటేశం బాధపడిపోతూ ”మీరు చెప్పింది నిజమే అనుకోండి. అయినా ఓసారి నేను రాసిన పేపరు చూడాలనుకుంటున్నా. మీరే ఏదోలా సాయం చేయాలి” అన్నాడు. దాంతో గిరీశం ఏవనుకున్నాడో ”సరేనోయ్‌.. మామూ లుగా అయితే ఆ ఛానల్‌ నేను వాడను. నా దగ్గరో బ్రహ్మాస్త్రం ఉంది. దాన్ని నీకోసం వాడతా” అన్నాడు. అలా అంటూనే అప్పటికప్పుడే  ఆ బ్రహ్మాస్త్రానికి.. అదే.. ఆంజనేయులికి ఫోన్‌ చేశాడు. అవతల ఆంజ నేయులు వెంటనే లైన్లోకి వచ్చాడు. ”ఏంటి గిరీశం.. ఈమధ్య ఫోను ల్లేవేంటీ?” అన్నాడు. కొంచెంసేపు ఆ మాటలూ ఈ మాటలూ అయ్యాక ”నాకో చిన్న సాయం చెయ్యాల్రా.. మావాడు గ్రూప్‌ ఫోర్‌ రాశాడు. వాడు అనుకున్న దాని కంటే మార్కులు బాగా తేడాగా వచ్చాయి. ఓసారి వాడి పేపరు చూడాలనుకుంటున్నాడు” అన్నాడు. దాంతో ఆంజనేయులు నవ్వేసి ”ఆ.. అదంతా ఎందుకురా.. ముందే చెబితే ఆ ఉద్యోగం వేయిం చేద్దును కదా” అన్నాడు. దాంతో గిరీశం ”లేదురా.. వాడికా ఉద్యోగం అదీ వొద్దు. రాసిన పేపరు చూస్తే చాలు” అన్నాడు. దాంతో ఆంజనేయులు ”సరేరా… ఓసారి మీవాడినొచ్చి నన్ను కలవమను” అంటూ ఫోన్‌ పెట్టేశాడు.
——-
అమరావతిలోని సెక్రటేరియట్‌.. వచ్చేపోయేవాళ్ళతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఆరోజూ అంతే. అయితే ఆరోజు వచ్చినోళ్ళలో వెంకటేశం ఉన్నాడు. వెంకటేశం అయితే నేరుగా వెళ్ళి ఆంజనేయులిని కలుసుకున్నాడు. ఆంజ నేయులు కూడా వెంటనే ఎవరికో ఫోన్‌ చేసి మాట్లాడి వెంకటేశాన్ని అక్కడికి పంపించాడు. వెంకటేశం వెళ్ళి బాలరాజు అనబడే ఆ అధికారిని కలుసుకున్నాడు. బాలరాజు వెంక టేశాన్ని లోపల కంప్యూటర్‌ సెక్షన్‌ లోపలికి తీసుకుపోయాడు. యింకో పది నిమిషాల్లో వెంకటేశం రాసిన పేపరేదో టేబుల్‌ మీద కొచ్చేసింది. మామూ లుగా అయితే అసలిదేం జరగదు. అంతా గిరీశం గారి బ్రహ్మాస్త్రం మాయంతే. వెంకటేశం గబగబా తన పేపరు చూసు కునే పనిలో పడ్డాడు. ఈలోగా అక్కగ గుమాస్తా కంప్యూ టర్‌లో మిగతా వివ రాలవీ చూసే పనిలో పడ్డాడు. అప్పుడు బయట పడిందది. దాంతో గుమస్తా మొహం పాలిపోయింది.  అమాంతం వెంక టేశం చేతులు పట్టేసుకున్నాడు. ”తప్పు జరిగిపోయింది. బాబూ… యిక్కడ  కంప్యూటర్‌లో కీ ఫీడ్‌ చేస్తారు. అయితే ఎక్కడో ఏదో ఒక ఎంట్రీ ఎగిరిపోయినట్టుంది. దాంతో మొత్తం సీరియల్‌గా అన్నీ తేడా వచ్చేశాయి. దీంతో నీవే కాదు. మొత్తం అందరి మార్కులూ తేడా వచ్చేశాయి. యిప్పు డిదంతా బయట కొస్తే చాలా అల్ల రయిపోతుంది” అన్నాడు కంగారుపడి పోతూ. ఆపాటికి జరిగిందంతా అర్థమై వెంక టేశం మనసు తేలికపడింది.  యింతలోనే పక్కనున్న బాలరాజు ”ఏం బాబూ.. ఏం చేద్దామనుకుంటున్నావ్‌..” అన్నాడు. వెంకటేశం తేలిగ్గా ”చేసేదేం ఉంది. వది లేద్దాం” అంటూ బయటికి నడిచాడు. వెనకాల నుంచి గుమాస్తా ”బాబు దేవుడు లాంటోడు. లేకపోతే అందరం మునిగిపోదుం!’ అనడం వినిపిస్తోంది.
——-
”గురూగారూ… అదీ రాత్రి నాకొచ్చిన కల. చాలా గమ్మత్తయిన కలనుకోండి. మొత్తానికి కలలో దేవుడినయిపోయా” అన్నాడు వెంకటేశం. గిరీశం తలూపి ”ఆ..ఏదో కలలో కాబట్టి అలా అయిపోయింది. వాస్తవంలో అయితే అదే కిందస్థాయి నిర్లక్ష్యం పైస్థాయిలో వాళ్ళ పీకకి చుట్టు కుంటుంది” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం ”అవునోయ్‌.. అసలిదంతా జరుగుతున్న చరిత్రలో ఓ హెచ్చరిక కోణం. కొంచెం వివరంగా చెప్పాలంటే… దేశంలో రాజకీయ పరిస్థితు లయితే బాగా వేడెక్కిపోయాయి. యిటు చంద్రబాబుని తీసుకుంటే పాత మిత్రుల్ని దూరం చేసుకోవడంలోగానీ, కొత్త పొత్తుల్ని కలుపుకోవడంలో గానీ చాలా కీలకమయిన నిర్ణయాలు తీసుకుంటున్న టైమ్‌ నడుస్తోంది. యిటువంటప్పుడు అన్ని వైపుల నుంచీ ఒత్తిళ్ళు ఖాయం. యిలాంటప్పుడు తనేంటనేది నిరూపించుకోవలసిన అవసరం బాబుకి ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే తను నడుపుతున్న  వ్యవస్థలో వ్యవ హారాల్లో కింద నుంచి అన్ని స్థాయిల్లో సహకారం ఉండి తీరాల్సిందే. కింద స్థాయిలో జరిగే తప్పు ఏదయినా తను బాధ్యుడయిపోతాడు. యిప్పటికే అమరావతి నిర్మాణంలోనూ, పోలవరం నిర్మాణంలోనూ చెప్పినంతగా జరగడంలేదన్న  విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే అమరావతిలో నిర్మించిన భవనాల్లో లీకేజీలు, మొన్న పోలవరానికి వెళ్ళే దారిలో రోడ్డు బద్దలయిపోవడం విమర్శలకి అవకాశం యిస్తున్నట్టవుతుంది. యింజనీర్ల యితే తేలిగ్గా ‘ట్రాఫిక్‌ ఎక్కువవడం వలనే అలా రోడ్‌ పగిలిండొచ్చు’ అని తేలిగ్గా తీసిపారేయొచ్చు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ‘ఆ..ఈ మాత్రం రోడ్‌నే సరిగ్గా వేయలేనోళ్ళు రేపు అంత పోలవరం ప్రాజెక్ట్‌ ఎలా కడతారు?’ అన్న స్థాయి విమర్శలు చేస్తున్నాయి. యిదంతా యిటువైపు. అవతల మోడీనే తీసుకుంటే.. మన రాష్ట్రం విషయంలో తనని తాను నిరూపించుకోవలసిన సమయం వచ్చేసింది. యింతకాలం ‘ఎంతిచ్చినా అదేదో రాష్ట్ర ప్రభుత్వ ఎకౌంట్‌లోకే పోతుంది’ అని చెప్పడం జరుగు తుంది. అయితే ప్రత్యేక రైల్వే జోను, కడపలో ఉక్కు ఫ్యాక్టరీల్లాంటివి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రమే చేయగలిగేవి. అవన్నీ చేస్తే రాష్ట్రానికి తామేదో చేస్తున్నామని చెప్పుకోడానికి వీలుంటుంది. ఏతావాతా చెప్పేదేంటంటే… మహా యుద్ధం ముంగిట బాబు,  మోదీ తమని తాము నిరూపించుకోవలసి ఉంది. అలా చేయ డంలో బాబుకి కింద నుంచీ  అన్ని స్థాయిల్లో సహకారం అందాలి. అలాగే మోడీకి అన్ని స్థాయిల నాయకుల నుంచీ  సరైన దారిలో నిర్ణయాలు తీసుకునే సూచనలు అందాలి” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here