లెక్కలు అడిగితే ఎదురుదాడి చేస్తారా?

0
252
తెదేపా ధోరణిపై ఎమ్మెల్యే ఆకుల ధ్వజం
రాజమహేంద్రవరం, ఆగస్టు 10 : పర్సనల్‌  డిపాజిట్‌ ఎక్కౌంట్‌లో నిధులు  జమచేయడం గురించి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా టీడీపీ  ఎదురుదాడి చేయడం దారుణమని అర్బన్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ  ధ్వజమెత్తారు. ప్రకాశం నగర్‌ లోని ఎమ్మెల్యే  కార్యాలయంలో శుక్రవారం ఉదయం పార్టీ నాయకులు క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్‌,అయ్యల గోపి,ఎన్‌ ఎన్‌ ఎస్‌ చంద్రశేఖర్‌,నాళం పద్మశ్రీ, నీరుకొండ వీరన్న చౌదరి,అడ్డాల మూర్తి తదితరులతో కలిసి  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిడి ఎక్కౌంట్స్‌కి ఆడిటింగ్‌ ఉండదని, దీనివలన  అవినీతి జరిగే ఆస్కారం వుందని, అందుకే దానికి లెక్కలు చెప్పాలని ఎవరు అడిగినా చెప్పాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. . లెక్కలు అడిగితే ఎదురుదాడి చేయడం తగదన్నారు. నీరు చెట్టు అంశం,సర్వశిక్షా అభియాన్‌ లో 2వేలకోట్లను 4,300కోట్లకు పెంచి ఆతర్వాత వెనక్కి తగ్గడం వంటి విషయాలను చూస్తుంటే అవినీతి గురించేనన్న విషయం బయట పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ బయట పడతాయన్న ఉద్దేశ్యంతో తప్పించుకునే ధోరణిలో సమాధానం చెప్పడం, ఎదురు దాడికి దిగడం చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం లెక్కలపై ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.  ఈ అవినీతిపై విచారణ చేయిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ,తెలుగు ప్రజలు అన్నీ గమన్సితున్నారని ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుందని అన్నారు.
లాలూచి కుస్తీ ఎవరిదో తేలింది :  నిన్నటి దాకా వాళ్ళూ, వీళ్లూ ఏకమై పోయారని గగ్గోలు పెట్టిన టిడిపి ఇప్పుడు ఎలా వ్యవహరించిందో అందరూ చూసారని, ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌ తో టిడిపి జతకట్టి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఓటు వేసిన సంగతి అందరూ గమనించారరని డాక్టర్‌ ఆకుల పేర్కొంటూ దీనికి ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here