లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం 

0
202
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8 : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా జడ్జి ఎన్‌ తుకారాంజీ ఆధ్వర్యంలో  జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్‌ భవనంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలోని 61 న్యాయ స్ధానాల్లో ఈరోజు వివిధ కేసుల్లో రాజీపడదగిన కేసులను లోక్‌ అదాలత్‌ల ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని సమయం, ధనం వృధా కాకుండా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. బ్యాంక్‌లు, ఎక్సైజ్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, పీఎల్‌సి తదితర కేసులను మూడు బెంచీల ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ గాయత్రీదేవి, జస్టిస్‌ జి.షణ్ముఖరావు, జస్టిస్‌ డి. శ్రీదేవి, న్యాయవాదులు ఎస్‌ నాగేశ్వరరావు, ఆర్‌ వి రమాదేవి, ఎం మల్లీశ్వరి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here