లోక కల్యాణార్థం చండీ హోమం

0
221
గన్ని కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహణ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 5 : శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రల శుభవేళ  వేద మంత్రోచ్ఛారణలతో శ్రీరామనగర్‌ పరిసరాలు ఈ ఉదయం మార్మోగాయి. చదువుల తల్లి సరస్వతి దేవి జన్మ తిథి మూలా నక్షత్రం నాడు శ్రీరామనగర్‌లోని శ్రీశ్రీశ్రీ సంకట హర వర సిద్ధి వినాయక ఆలయ స్ధాపకులు, గుడా ప్రప్రథమ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు గన్ని కృష్ణ, రాజరాజేశ్వరి దంపతులు ఏటా మాదిరిగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో మూలా నక్షత్ర ప్రయుక్త చండీ హోమాన్ని నిర్వహించారు. గన్ని తన స్వగృహ ప్రాంగణంలోనే హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించిన అనంతరం దాదాపు మూడు గంటల పాటు చండీ హోమం క్రతువును నిర్వహించారు. బ్రహ్మశ్రీ వారణాశి శ్రీనివాసశర్మ, వారణాశి సతీష్‌ శర్మల బ్రహ్మత్వంలో సాగిన ఈ చండీ హోమానికి పెద్ద ఎత్తున స్ధానికులే గాక పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నాయకులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. హోమానంతరం అమ్మవారికి ప్రీతిగా విశేష పూర్ణాహుతి  జరిగింది. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ వివివి చౌదరి,మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జి.ఎస్‌.ఎల్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు, కంటిపూడి సర్వారాయుడు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాల రాయుడు, ఎఎస్‌ఆర్‌ ప్రభు, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు,మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, రెడ్డి రాజు, రుంకాని వెంకటేశ్వరరావు,డోకల అప్పారావు,పిల్లి సుబ్రహ్మణ్యం, కొత్తూరి బాల నాగేశ్వరరావు,పెండ్యాల రామకృష్ణ, ఆళ్ళ ఆనందరావు,యర్రమోతు ధర్మరాజు, కరుటూరి నరసింహారావు, బిక్కిన సాంబ, మాజీ కార్పొరేటర్లు మళ్ళ నాగలక్ష్మి, కోసూరి చండీప్రియ,తలారి ఉమాదేవి,సింహా నాగమణి, తంగెళ్ళ బాబీ,పాలవలస వీరభద్రం,కంటిపూడి పద్మావతి,గొర్రెల సురేష్‌, గగ్గర సూర్యనారాయణ,బూర దుర్గాంజనేయరావు, మజ్జి పద్మ,జవ్వాది మురళీకృష్ణ,అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌,బుడ్డిగ రాధా, కంటిపూడి శ్రీనివాస్‌, మళ్ళ వెంకట్రాజు,ఎ.సైదుబాబు, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, దంతులూరి వెంకటపతిరాజు,మార్ని సురేష్‌, కంటిపూడి జగ్గారావు, కెఎస్‌ ప్రకాశరావు,వారాది హనుమంతరావు,జక్కంపూడి శ్రీరంగనాయకులు,తలారి భగవాన్‌,మజ్జి శ్రీనివాస్‌,మరుకుర్తి రవియాదవ్‌, గొర్రెల రమణ, జక్కంపూడి అర్జున్‌, శీలం గోవింద్‌,కవులూరి వెంకట్రావు,మొల్లి చిన్నియాదవ్‌, సెనివాడ అర్జున్‌, కంచిపాటి గోవింద్‌, వానపల్లి శ్రీనివాసరావు,తలారి భాస్కర్‌, వానపల్లి సాయిబాబా, కెవి శ్రీనివాస్‌, జి.కొండబాబు, సింహాద్రి కోటిలింగేశ్వర రావు,కోట కామరాజు,ఎం.శ్రీనివాస్‌(కాపు),వారాది నాగబాబు,ఆదూరి రమేష్‌, శేఖర్‌,దమర్‌ సింగ్‌ బ్రహ్మజీ,వంకా శ్రీనివాస్‌ చౌదరి,పాలవలస బ్రహ్మాజీ,సంసాని ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here