వచ్చే ఎన్నికల్లో బిసిల సత్తా చూపిద్దాం

0
265

బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొడుగు శ్రీనుకు సత్కారం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21 : రానున్న ఎన్నికల్లో బిసిలకు అన్యాయం చేసే పార్టీకి బుద్ది చెప్పేలా సంఘాన్ని బలమైన శక్తిగా తయారు చేయాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ఈరోజు నగరానికి వచ్చిన ఆయన ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పొడుగు శ్రీను(గాడాల) ను ఘనంగా సత్కరించారు. సంఘ పటిష్టతకు పనిచేస్తూ, బిసిల హక్కుల కోసం క షి చేస్తున్న శ్రీను భవిష్యత్తులో మరింత కష్టపడి సంఘాన్ని బలపరచాలని సూచించారు. రానున్న కాలంలో సంఘం ఆదేశించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జె.ఎ.సి.కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ మార్గాని రామక ష్ణ గౌడ్‌, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్‌, నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here