వణికిస్తున్న చలిలోనూ ఉత్సాహంగా విద్యార్ధుల  5 కె రన్‌ 

0
252
రాజమహేంద్రవరం, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యాన ఈరోజు నగరంలో 5 కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్సు కళాశాల వద్ద ఈ రన్‌ను కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ ప్రారంభించగా వై.జంక్షన్‌, కంబాలచెరువు, దేవీచౌక్‌, గోకవరం బస్టాండ్‌ మీదుగా పుష్కరఘాట్‌కు చేరుకుంది. వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, కార్పొరేషన్‌ సిబ్బంది ఈ రన్‌లో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నగర పాలక సంస్థ పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ప్రైవేటు కళాశాలల విద్యార్ధులు కూడా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకుని ప్రతి రోజు వ్యాయమానికి సమయం కేటాయించాలని అన్నారు. వాహనాలపై ప్రయాణించేటప్పుడు ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ధూమపానానికి యువత దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా 5 కె రన్‌లో విజేతలుగా నిలిచిన వి.శివాజీ, డీకెఎన్‌ పవన్‌ తేజా, వి.హరీష్‌, జి.శివరామకృష్ణలను కమిషనర్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, కొమ్మ శ్రీనివాసరావు, పితాని లక్ష్మీకుమారి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, తెదేపా నాయకులు ఆదిరెడ్డి వాసు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ సత్యనారాయణ, సహాయ కమిషనర్‌ రాజగోపాలరావు, మేనేజర్‌ శ్రీనివాసరావు, స్కూల్స్‌ సూపర్వైజర్‌ దుర్గా ప్రసాద్‌, కార్యదర్శి శైలజా వల్లి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here