వరుస శంకుస్థాపనలతో డిప్యూటీ సీఎం కె.ఇ. బిజీ బిజీ 

0
392
అర్బన్‌ తహసీల్ధార్‌ నూతన కార్యాలయ భవనానికి పునాది
రాజమహేంద్రవరం, జూలై 3 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.క ష్ణమూర్తి నగరంలో ఈరోజు సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గృహాంలో అల్పహారాన్ని స్వీకరించిన అనంతరం పాత సోమాలమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ. రెండు కోట్లతో చేపట్టే మున్సిపల్‌ స్టేడియం అభివ ద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఆదర్శనగర్‌లో రూ.1.09 కోట్లతో మున్సిపల్‌ పార్క్‌ అభివ ద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కోటిపల్లి బస్టాండ్‌ సమీపాన అర్బన్‌ తహాసీల్దార్‌ కార్యాలయ నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 34 వ డివిజన్‌లో రూ.2.75 కోట్లతో లా హస్పిన్‌ ¬టల్‌ దగ్గర వాటర్‌ పైప్‌ లైన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు  ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అలాగే పదో డివిజన్‌లోని సాయినగర్‌లో రూ.1.08 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పైపులైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. 50 వ డివిజన్‌లో రూ.రెండు కోట్లతో పైప్‌ లైన్‌ నిర్మాణానికి కృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమాల్లో ఎంపి మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, శాప్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here