వర్తకుల సమస్యలను పరిష్కరిస్తా :అనుశ్రీ సత్యనారాయణ 

0
219
తాడితోట మార్కెట్‌లో జనసేన అభ్యర్థి విస్తృత ప్రచారం
రాజమహేంద్రవరం, మార్చి 26 : వర్తకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని, నిరంతరం అందుబాటులో ఉంటూ వర్తకుల సమస్యలను పరిష్కరిస్తానని జనసేన రాజమండ్రి సిటీ అభ్యర్థి  అనుశ్రీ సత్యనారాయణ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడితోట మహాత్మాగాంధీ హోల్‌ సెల్‌ క్లాత్‌ మార్కెట్‌ లో బుధవారం ప్రచారం చేసారు. వస్త్ర దుకాణ దారులను, వర్కర్లు ,గుమాస్తాలను కలుసుకుని  ఓటువేసి జనసేన తరపున పోటీచేసున్న తనను గాజు గ్లాస్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు . వర్తకుల సమస్యలు తనకు తెలుసునని, వర్తకులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుంటానని ఆయన చెప్పారు. ఈ ప్రచారంలో షాప్‌ షాప్‌ తిరుగుతుంటే  వర్తకులనుంచి మంచి స్పందన లభించింది. సిపిఐ సిపిఎం ,బిస్పీ బలపర్చిన జనసేన పార్టీని ఈ ఎన్నికలలో  గెలిపించి పవన్‌ కళ్యాణ్‌ ని సీఎం చేయాలనీ కోరారు. ఈకార్యక్రమంలో జామి సత్యనారాయణ, డి గురుమూర్తి,కిలారి దుర్గాప్రసాద్‌,బీటెన్‌ నాగేశ్వరరావు,తేజోమూర్తుల మూర్తి,ఇందిరా,చలపతి,పైడిరాజు,శ్యాం తదితరులు పాల్గొన్నారు.
జనసేనలో భారీగా  చేరిక :  స్థానిక పార్టీ ఎన్నికల కార్యాలయంలో1వ వార్డుకి చెందిన   గెడ్డం నాగరాజు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు జనసేనలో చేరారు. అలాగే జనసేన నాయకురాలు డాక్టర్‌ అనసూరి పద్మాలత ఆధ్వర్యాన  50వ వార్డుకి చెందిన  సిటీఆర్‌ఐ ప్రాంతంలో  100 మంది మహిళలు, యువకులు పార్టీలో  చేరారు. ఈ సందర్బంగా వారికి అభ్యర్థి అనుశ్రీ సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి స్వాగతం  పలికారు. ప్రజల్లోకి పార్టీని, పవన్‌కళ్యాణ్‌  ఆశయాలను, సిద్ధాంతాలను తీసుకెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here