వాకర్స్‌ యోగా అండ్‌ లాఫింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యాన పింఛన్ల పంపిణీ

0
262
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : స్థానిక దానవాయిపేట గాంధీ పార్కు ఆవరణలో ప్రతినెల మాదిరిగా అనాధలైన వృద్ధులకు పింఛన్లు, ప్రతిభ గల పేద విద్యార్ధులకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం వాకర్స్‌ యోగా అండ్‌ లాఫింగ్‌ క్లబ్‌ అధ్యక్షులు సూరపురెడ్డి తాతారావు అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్‌ గౌరవ అధ్యక్షులు వర్రే శ్రీనివాసరావు, యార్లగడ్డ మోహనరావు మాస్టారు డా.అహ్మద్‌, కొల్లి సత్యనారాయణ, తమ్మన సూర్యప్రకాశరావు, వేరుకొండ రాధాకుమారి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లబ్‌ ద్వారా నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని వివరించి రాబోయే కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని క్లబ్‌ సభ్యులకు సూచించారు. యార్లగడ్డ మోహనరావు మాట్లాడుతూ నగరంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలలో ఈ క్లబ్‌ మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. క్రమశిక్షణతో నిర్వహించే క్లబ్‌ కార్యక్రమాలకు స్పందించి రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. కొల్లి సత్యనారాయణ, తమ్మన సూర్యప్రకాశరావు మాట్లాడుతూ క్లబ్‌ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ సహాయముంటుందన్నారు. క్లబ్‌ సెక్రటరీ దుబ్బిరెడ్డి చిన వెంకట్రావు మాట్లాడుతూ తమ కార్యవర్గం 2 సంవత్సరంలో క్లబ్‌ అభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా మరొక సంవత్సరం తమ కార్యవర్గానికి అవకాశం ఇచ్చినందుకు క్లబ్‌ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ మరింత ఉత్సాహంతో క్లబ్‌ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అనంతరం 100 మంది అనాధలైన వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున పింఛన్లు వారికి అల్పాహారంగా పులిహోర, స్వీట్లు ముఖ్యఅతిధుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మట్టా శేషు, బొల్లా సత్తిబాబు, గీసాల బాబ్జి, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, అల్లు మధు, జి.ఎస్‌.ఎన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమం మొత్తం క్లబ్‌ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, క్లబ్‌ గౌరవ కార్యదర్శి ఆనాపు పుల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.