వారంలోగా జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలుపై ప్రకటన

0
290

జర్నలిస్టుల హౌసింగ్‌ కోసం బడ్జెట్‌ లో ప్రత్యేక నిధులు

సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు

రాజమహేంద్రవరం ఫిబ్రవరి 10 : ఏపీలో జర్నలిస్టులకు గ హానిర్మాణాలుపై వారం రోజులలో విధాన నిర్ణయ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిస్తామని రాష్ట్ర సమాచార, గ హానిర్మాణ శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. అలాగే జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధిని బడ్జెట్‌ లో ప్రవేశపెట్టాలనే అంశంపై కూడా కసరత్తు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. నగరానికి వచ్చిన మంత్రిని ఆంధ్రప్రదేశ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపియుడబ్ల్యూజె) రాష్ట్ర ఉపాధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి ఆర్‌ అండ్‌ బి అతిధిగ హాంలో కలిసి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలు, అక్రిడియేషన్ల సమస్యలుపై చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన త్రిబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించాలని, అక్రిడియేషన్లు మంజూరుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని, అక్రిడియేషన్ల నియమ నిబంధనలలో వర్కింగ్‌ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి శ్రీనివాసులు స్పందిస్తూ వారం రోజులులోగా జర్నలిస్టుల హౌసింగ్‌ పై విధివిధానాలు ప్రకటిస్తామని, అయితే అమరావతిని, జిల్లాలను కలిపి ఒకే విధానం అమలు చేయాలా, జిల్లాలకు ప్రత్యేకంగా చేయాలా అన్న అంశం కసరత్తు తుది దశకు చేరుకుందని తెలిపారు. తొలుత జిల్లాలు, నియోజకవర్గాల కేంద్రాలు, మండలాలకు సంబంధించి జర్నలిస్టుల హౌసింగ్‌ స్కీమ్‌ ప్రకటించాలని భావిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌ తెలిపారు. అయితే ఇళ్ల నిర్మాణాలు అపార్ట్‌ మెంట తరహాలో చేపట్టాలని (ఒక సముదాయంగా), దీనికి లబ్దిదారుడైన జర్నలిస్ట్‌కు తన వాటా మొత్తాన్ని బ్యాంకు రుణం ఇప్పించడం, వ్యయంలో కొంత సబ్సిడీగా ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇందుకు బడ్జెట్‌ లో 200 కోట్ల వరకూ నిధులు జర్నలిస్టుల హౌసింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించాలనే ఆలోచన వుందని మంత్రి శ్రీనివాసులు తెలిపారు. అలాగే గతంలో జర్నలిస్టుల కోటాలో ఇళ్లస్థలాలు పొందిన వారికి ప్రభుత్వం తరపున సబ్సిడీ రుణం అందించి ఇళ్ళు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని వీటన్నింటికీ విధివిధానాలు రూపకల్పన తుదిదశకు చేరుకున్నాయన్నారు. అక్రిడియేషన్ల నియమ నిబంధనల విషయంలో కసరత్తు పూర్తి అవుతుందని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్య్లూజె రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు జిఎ భూషన్‌ బాబు, ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా గౌరవాధ్యక్షులు కె. పార్ధసారధి, ఎపియుడబ్య్లూజె జిల్లా ఉపాధ్యక్షులు టి.శ్రీనివాస్‌ , జిల్లా జాయింట్‌ సెక్రటరీ పాలపర్తి శ్రీనివాస్‌, చిన్నపత్రికల సంఘం జిల్లా అధ్యక్షులు జమ్మా రమేష్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here