వారి జీవితం ఆదర్శప్రాయం

0
171
గన్ని కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 2 : అహింసా అనే అయధంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీ, నీతి, నిజాయితీలతో ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జీవితం అందరికి ఆదర్శప్రాయమని గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా గన్ని కృష్ణ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీ, శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ గాంధీ లాంటి మహనీయుడు ఈ భూమ్మీద నడిచారా అన్న ఆశ్చర్యాన్ని విదేశీయులు వ్యక్తం చేస్తారన్నారు. గుడా చైర్మన్‌ గా తాను యూరప్‌ దేశాలలో పర్యటించినప్పుడు లిస్బిన్‌లో గాంధీ విగ్రహం కనిపించిందని, ఆయనను దేశవిదేశాలలో కొనియాడతారన్నారు. ఒక విధంగా గాంధీ వలనే దేశానికి గౌరవం వచ్చిందని, అలాంటి వ్యక్తిని మన భారతీయులే చంపడం చాలా విచారకరమన్నారు. కాబట్టి ఆయన మార్గం, బోధనలే అందరికి శరణ్యమని, మార్గదర్శకమని కొనియాడారు. కేవలం 11 నెలలు దేశ ప్రధానిగా పనిచేసిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాకిస్తాన్‌తో యుద్దం సాగించి విజయకేతనం ఎగురవేశారని, నీతి,నిజాయితీలకు ఆయన ఆదర్శమన్నారు.అంతటి హోదా కలిగిన ఆయనకు స్వంత గృహం కూడా లేదని, నేటి యువతకు ఆయన మార్గదర్శకమన్నారు. ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించినప్పుడు తాను చూశానని, ఆయన ప్రసంగించిన స్టేడియానికి లాల్‌ బహదూర్‌ అని, పయనించిన మార్గానికి లాల్‌ బహదూర్‌ శాస్త్రి రోడ్‌ అని నామకరణం చేయడాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, కంటిపూడి శ్రీనివాస్‌, యిన్నమూరి రాంబాబు, పాలవలస వీరభద్రం, మళ్ళ వెంకట్రాజు, మొల్లి చిన్నియాదవ్‌, శనివాడ అర్జున్‌, వానపల్లి శ్రీనివాసరావు, వానపల్లి సాయిబాబా, కెవి శ్రీనివాస్‌, జి.కొండబాబు, పాలవలస బ్రహ్మజీ, గోవింద్‌, పేపర్‌మిల్లు కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here