వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ అభినందనీయం : గుడా చైర్మన్‌ గన్ని

0
254

రాజమహేంద్రవరం, జనవరి 10 : సంక్రాంతి పండుగను పేదవారు కూడా సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో చేపట్టిన వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ కార్యక్రమం అభినందనీయమని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ అన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సారధ్యంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌, జైన్‌ సేవా సమితి,జెసిఐ రాజమండ్రి, లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి సంస్ధలు సంయుక్తంగా పుష్కర్‌ ఘాట్‌ వద్ద నిర్వహించాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ ప్రారంభించి పేదలకు వస్త్రాలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరానికి చెందిన ప్రముఖ స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా ప్రతి ఏటా వాల్‌ ఆఫ్‌ హ్యపీనెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.వినియోగించిన వస్త్రాలను పేదలకు అందించడంలో వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు.స్వర్ణాంధ్ర వ ధ్దులకు అండగా నిలుస్తుండగా, జైన్‌ సేవా సంస్ధ నిర్వాహకులు విక్రమ్‌ జైన్‌ తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం చేస్తున్న సేవలు నిరూపమానమన్నారు.ఈ కార్యక్రమానికి 50 కొత్త చీరలు తెచ్చిన విక్రమ్‌ జైన్‌ను అభినందిస్తూ గుబ్బల రాంబాబు చొరవను అభినందించారు. గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మూడేళ్ళుగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 20వేల మందికి దుస్తులు రాజమహేంద్రవరంతో పాటు వివిధ ప్రాంతాల వారికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకన్య గ్రాండ్‌ అధినేత వి.సూర్యనారాయణ రాజు, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌ జైన్‌, లయన్స్‌ క్లబ్‌ పూర్వపు గవర్నర్‌ గ్రంధి వెంకటేశ్వరరావు, స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు బొప్పన నాగేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఉప్పులూరి జానకిరామయ్య, బొలిశెట్టి చిట్టిబాబు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు భువనగిరి వెంకటరమణ, స్కూల్స్‌ సూపర్‌ వైజర్‌ దుర్గా ప్రసాద్‌, రాచూరి వెంకట క ష్ణ, ఓ.ఎన్‌.జి.సి.రాజు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here