వాసవీ బెస్ట్‌ గవర్నర్‌ అవార్డ్‌ అందుకున్న బోడా సాయి సూర్య ప్రకాష్‌

0
89
రాజమహేంద్రవరం,ఆగస్టు 21 : వాసవీ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ బెస్ట్‌ గవర్నర్‌ అవార్డును డిస్ట్రిక్ట్‌ వి ఏ 210  గవర్నర్‌ బోడా సాయి సూర్య ప్రకాష్‌ అందుకున్నారు.  2019 సంవత్సరంలో జిల్లాలో అత్యధిక సభ్యత్వాలను చేర్పించడంతో పాటు క్లబ్‌ అభివృద్ధికి చేసిన కృషికి గాను యాదగిరి గుట్టలో సోమా రాధాకృష్ణ ఫంక్షన్‌ హాల్లో జరిగిన జాతీయ సదస్సులో వాసవీ ఇంటర్నేషనల్‌ అధ్యక్షులు వేముల హజ్రతయ్య గుప్తా చేతుల మీదుగా ప్రకాష్‌ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా పాస్ట్‌ గవర్నర్లు బాలనాగు కాశీ విశ్వేశ్వర రావు, శిఘాకొల్లి కరుణ కుమార్‌, నాళం ఆండాళ్‌, చక్కా ప్రకాష్‌, వెలగా వెంకట నగేష్‌, కొత్త శ్రీకాంత్‌, చేక్కా వీవీ ఎస్‌ ఎన్‌ మూర్తి, వాసవీ సభ్యులు, నగర ప్రముఖులు ప్రకాష్‌ను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here