విఎల్‌ పురంలో నరవ ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు  

0
201
పాటలు, డ్యాన్సులు, క్రికెట్‌, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు
రాజమహేంద్రవరం, జనవరి 14 : వీరేశలింగపురం(విఎల్‌ పురం) అంటే సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని పలువురు వక్తలు పేర్కొన్నారు. విఎల్‌ పురం ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో 30వ సంక్రాంతి సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఎల్‌ పురం ఫ్రెండ్స్‌ సర్కిల్‌ అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ సారధ్యంలో ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలలో భాగంగా వివిధ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్ధాయిలో పాటలు, డాన్స్‌ పోటీలు, క్రికెట్‌, ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు పోటీ విజేతలకు శనివారం సాయంత్రం నరవ గోపాపల కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ ఏటా విఎల్‌ పురం సెంటర్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నరవ కృషిని ప్రసంశించారు. సంక్రాంతి సంబరాలు అంటే విఎల్‌ పురం సెంటర్‌ గుర్తుకు వచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విఎల్‌ పురం ఫ్రెండ్స్‌సర్కిల్‌ను అభినందించారు. మాజీ శాసన సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతి సంబరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది విఎల్‌ పురం సెంటరేనన్నారు.  వైకాపా రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, వైసిపి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, బిసి సంఘాల జేఏసి ఛైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, బీసి నాయకులు రుంకాని వెంకటేశ్వరరావు, గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత, ఈడిగ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు రెడ్డి రాజు, రివర్‌ క్రెస్ట్‌ అధినేత ఎన్‌టివి రమణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా చింతామణి నాటక పాత్రధారిణి రాధికను రుంకాని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సత్కరించారు. పాటలు, డాన్స్‌, క్రికెట్‌, ముగ్గుల పోటీల విజేతలకు ముఖ్య అతిధులు చేతుల మీదుగా నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. క్రికెట్‌ పోటీ విజేతగా జక్కంపూడి లెవెన్‌ నిలవగా, దాదా లెవెన్‌ రన్నర్స్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో కడలి వెంకటేశ్వరరావు, మురపాక వీర్రాజు, ఎస్‌ కృష్ణ, మార్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, మజ్జి అప్పారావు, దాది సత్యనారాయణ, గోలి రవి, నీలపాల తమ్మారావు, వాకచర్ల కృష్ణ, గొర్రిపాటి చిన్నబాబు, సుబాషిని, ముంతా సుమతి తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి వెంకటేశ్వరరావు, భద్రం, ఆరే చిన్న, వైదానం శ్రీను, రుక్కు తదితరులు పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here