విజయవాడలో కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం

0
264
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని  కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌  బి. భవాని నాగేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి సేవాదళ్‌ విభాగం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లాది విష్ణు, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షులు గోలి రవి, ఎస్‌.సుబ్బారావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, ఆనంద్‌,శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.