విజయ్‌రాజ్‌ సింధియా జన్మదినోత్సవం

0
342
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  13 : బిజెపి సీనియర్‌ నాయకురాలు విజయ్‌రాజ్‌ సింధియా 95 వ జన్మదినోత్సవం సందర్భంగా భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు 36 వ డివిజన్‌లో మొక్కలు నాటి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీగా అవతరించినాటి జనసంఘ్‌లో విజయ్‌రాజ్‌ సింధియా ప్రముఖంగా ఉన్నారని, జనసంఘ్‌లో ఆమె క్రియాశీలక కార్యకర్తగా ఉండి బిజెపి  ఆవిర్భావానికి ఎంతో కృషి చేశారని అన్నారు. గ్వాలియర్‌ సంస్ధానానికి చెందిన ఆమె కుటుంబ నేపధ్యాన్ని  కూడా పక్కనబెట్టి కుమారుడు మాధవరావు సింధియాతో విభేదించి కూడా జనసంఘ్‌ నిర్మాణానికి ఆమె చూపిన శ్రద్ధ, పట్టుదల అనిర్వచనీయమన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల ప్రకారం అతిపెద్ద గ్వాలియర్‌ సంస్ధానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయడం  మరువలేని విషయమన్నారు. ఈ కార్యక్రమంలో47 వ డివిజన్‌ కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, కె.గీత, ఆర్‌.శ్రీదేవి, తంగెళ్ళ పద్మావతి, ఐ.విజయలక్ష్మీ, ఆర్‌ కృష్ణవేణి, కొండపల్లి సత్య, తంగెళ్ళ శ్రీనివాస్‌, దాస్యం ప్రసాద్‌, తీడా నాగరాజు, పెదిరెడ్ల శ్రీను, శేశెట్టి నూకరాజు పాల్గొన్నారు.