విజయ డెంటల్‌ ఆసుపత్రిలో ఎన్‌టిఆర్‌ వైద్య సేవలు

0
235

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10 : అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో గత 14 సంవత్సరాలుగా దంత వైద్యంలో సేవలందిస్తున్న విజయ సూపర్‌ స్పెషాలిటీ దంత వైద్యశాలకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, వర్కింగ్‌ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు నగదు రహిత దంత వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్‌ కమిటీ చైర్మన్‌, శాసనమండలి సభ్యులు వి.వి.వి.చౌదరి (కూర్మాపురం అబ్బు), ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేతలు డాక్టర్‌ ఉప్పలపాటి వెంకటరాజు చౌదరి, ఉప్పలపాటి శిరీష, మేకా పవన్‌ మాట్లాడుతూ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా లిటిల్‌ పెరల్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామని, తమ వద్ద లేటెస్ట్‌ అడ్వాన్స్‌మెంట్స్‌ ట్రీట్‌మెంట్స్‌, డెంటల్‌ ఇంప్లాంట్‌, లేజర్‌, డెంటస్టరీ, డిజిటల్‌ స్మైల్‌ డిజైనింగ్‌ మొదలైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టులు, ఓఎన్జీసీ ఉద్యోగులకు వివిధ రకాల స్కీమ్‌ల ద్వారా నగదు రహిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గత 14 సంవత్సరాలుగా తమకు సహకారం అందిస్తున్న వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, సత్యవరపు గోకుల మురళీకృష్ణ, కాకర్ల సుజన, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, డాక్టర్‌ తిర్నాతి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here