విద్యార్థులకు నాణ్యమైన విద్య 

0
128
”నాడు-నేడు”లో ఎంపి భరత్‌   .                   .
రాజమహేంద్రవరం,జనవరి 13: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. స్థానిక ఆర్యాపురం నన్నయ్య మునిసిపల్‌ హైస్కూలు అభివ ద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ  నగరంలో 64 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ”నాడు-నేడు”కార్యక్రమంలో భాగంగా మొదట దశలో 27 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు 4.75 కోట్లు రూపాయలతో ప్రణాళికను వేయడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించటం జరుగుతుందని, కార్పొరేట్‌ స్థాయికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.మన ప్రభుత్వం నూతనంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటం జరుగుతుందిని దీనిద్వారా పై చదువులకు ఎంతో ఉపయోగ పడుతుందిని దీనితోపాటు పోటీ పరీక్షలకు మరింత ఉపయోగ పడుతుంది తెలిపారు. రాష్ట్రంలో 42 వేలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటి అభివ ద్దికి ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందించటం జరిగిందని అన్నారు. విద్యతో పాటు నాణ్యమైన వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందించటం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన అభివృధ్ది పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఈఈ-పాండురంగారావు,విద్యాశాఖ అధికారి దిలీప్‌ కుమార్‌,మార్గాని సురేష్‌ , ఉప్పాడ కోటరెడ్డి, సంకిస భవానీప్రియ, కాటంవరం రాజు,నందం స్వామి, మీసాల గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here