విద్యార్ధి దశ ఎంతో కీలకం

0
190
యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన డిఎస్పీ కులశేఖర్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 11 : జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే విద్యార్ధి దశ కీలకమైనదని సెంట్రల్‌ జోన్‌ డిఎస్పీ కె.కులశేఖర్‌ అన్నారు. బీసీ విద్యార్ధి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆత్మ హత్యలు వద్దు.. చదువే ముద్దు’ యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌ను కులశేఖర్‌ ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, జీవితాలను అర్థంతరంగా ముగుస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయన్నారు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించగలిగితే ముందున్న జీవితాన్ని స్వర్ణమయం చేసుకోవచ్చన్నారు. ర్యాగింగ్‌ను చిన్న వ్యవహారంగా తీసుకోవద్దని, ఒకరి ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే చట్టరీత్యా  నేరమన్నారు. ఈ కార్యక్రమంలో బర్ల సీతారత్నం, బండారు రాజేశ్వరరావు, ఎం.డి.ఆరిఫ్‌, చెన్నూరి విష్ణు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here